ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దేవుడిపై ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాం!

డబ్బులు మాయమైతే... పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. కొంతమంది అధికారులు మాత్రం.. దేవుడిపై ప్రమాణం చేసేందుకు వెళ్లారు. ఆ కథ తెలియాలంటే చిత్తూరు జిల్లా చౌడేపల్లెకి వెళ్లాల్సిందే..!

By

Published : Nov 3, 2019, 6:20 AM IST

Updated : Nov 3, 2019, 7:39 AM IST

village secretaries oathing on god about money

దేవుడిపై ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాం!

ప్రజల సొమ్ము మాయమైనా... అధికారులు స్వాహా చేసినట్లు అనుమానం వచ్చినా.. ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. చిత్తూరు జిల్లాలోని ఓ పంచాయతీ అధికారులు మాత్రం... పింఛను డబ్బులు మాయమైతే ఆ పంచాయితీనీ దేవుని ముందుకు తీసుకెళ్లారు.

పింఛన్ల సొమ్ము రూ.లక్ష మాయమైన సంఘటన చిత్తూరు జిల్లా చౌడేపల్లె ఎంపీడీవో కార్యాలయంలో జరిగింది. మండల అధికారులు స్థానిక ఇండియన్ బ్యాంకు నుంచి రూ.28 లక్షల 43 వేల 500లను డ్రా చేసి.. పింఛన్లు పంపిణీ చేయాల్సిందిగా ఆయా గ్రామాల కార్యదర్శులకు అప్పజెప్పారు. ఈ క్రమంలో చౌడేపల్లే కార్యదర్శికి 6 లక్షల 90 వేల రూపాయలు అందించారు. చౌడేపల్లి కార్యదర్శి ఆ సొమ్మును బ్యాగులో పెట్టుకుని.. మండల కేంద్రంలోనే ఓ కార్యాలయానికి వెళ్లారు. పింఛన్లు​ పంపిణీ చేద్దామని బ్యాగు తెరచి చూస్తే.. అందులో రూ.లక్ష తక్కువగా ఉంది. చేసేదేమీ లేక.. లబోదిబోమంటూ... ఎంపీడీవోకు విషయాన్ని వివరించారు.
ఎంపీడీవో స్థానిక ఎస్సైకి తెలిపారు. పోలీసులు, ఎంపీడీవో ఇండియన్ బ్యాంకు వద్దకు వెళ్లి సీసీ ఫుటేజీని పరిశీలించగా.. బ్యాంకు నుంచి లెక్క ప్రకారం డబ్బు తెచ్చినట్లు తేలింది. అయితే మండల అధికారులు కార్యదర్శులకు నగదు పంపంకంలో ఎవరికైనా.. ఎక్కువ ఇచ్చారా? అనే కోణంలో పరిశీలించినా.. విషయం తెలియలేదు. అనంతరం రాజనాల బండ వద్దకు అధికారులను తీసుకెళ్లారు. సత్యప్రమాణాల క్షేత్రంగా పేరొందిన ఇక్కడ... నిజాలు చెబుతారని ఓ నమ్మకం. అక్కడ పూజారి అధికారులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. ఎవరి దగ్గర డబ్బులున్నాయో వచ్చి.. చెబితే... వారి పేరు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. దీని వల్ల ప్రమాణం కథ వాయిదా పడింది. చూడాలి ఏం జరుగుతుందో.

Last Updated : Nov 3, 2019, 7:39 AM IST

ABOUT THE AUTHOR

...view details