చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో విద్యాప్రకాశానంద స్వామి జయంత్యుత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గీతా మకరందం స్వామిగా ప్రపంచానికి సుపరిచితులైన విద్యాప్రకాశానందగిరి స్వామి జయంతికి... దేశంలోని పలు పీఠాధిపతులు హాజరై సత్సంగం చేపట్టారు. భగవద్గీతను ప్రతి ఒక్కరూ అధ్యయనం చేయాలనే ఉద్దేశంతో.. గీతా మకరందం పేరుతో గీతలోని సారాంశాన్ని మకరందం రూపంలో ప్రపంచానికి అందించారని పీఠాధిపతులు కొనియాడారు. ఈ ఉత్సవానికి అధికసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఘనంగా శ్రీ విద్యాప్రకాశానంద స్వామి జయంత్యుత్సవాలు - శ్రీకాళహస్తి
గీతా మకరందం స్వామిగా ప్రపంచానికి సుపరిచితులైన విద్యాప్రకాశానందగిరి స్వామి జయంతి ఉత్సవాలు శ్రీకాళహస్తిలో ఘనంగా జరిగాయి. దేశంలోని పలు పీఠాధిపతులు హాజరై సత్సంగం చేపట్టారు
ఘనంగా శ్రీ విద్యాప్రకాశానంద స్వామి జయంత్యుత్సవాలు