venkaiah naidu in tirumala: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తిరుమల చేరుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఉపరాష్ట్రపతి దంపతులకు.. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి స్వాగతం పలికారు. రేణిగుంట నుంచి యోగిమల్లవరం సమీపంలోని రాహుల్ కన్వెన్షన్ హాలుకు చేరుకున్న ఉపరాష్ట్రపతి దంపతులు.. అక్కడ వారి మనవరాలి పెళ్లి వేడుకలో పాల్గొన్నారు.
నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం.. తిరుమలకు బయలుదేరి వెళ్లారు. తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహం చేరుకున్న వారికి తితిదే ఈవో జవహర్ రెడ్డి, అధికారులు ఘన స్వాగతం పలికారు.