ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆందోళన వద్దు.. పురుగుల మందులు తినే కోళ్లు చనిపోతున్నాయి..' - కోళ్ల మృతికి బర్డ్ ఫ్లూ కారణం కాదు

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం మల్లయ్యపల్లిలో కోళ్లు మృతికి పంట పొలాలకు వేసిన పురుగు మందులే కారణమని వెటర్నరీ వైద్యులు నిర్ధారించారు. గ్రామంలోని నాటు కోళ్లు మృతిచెందిన ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించి కోళ్లను పరీక్షించారు. ఈ కోళ్ల మృతికి బర్డ్ ఫ్లూ కారణం కాదని తెలిపారు.

veterinary doctors clarify on cocks dies in mallaiah palli
వెటర్నరీ డాక్టర్లు

By

Published : Jan 8, 2021, 3:42 PM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం మల్లయ్యపల్లిలో నాటు కోళ్లు మృతి చెందడంపై వెటర్నరీ డాక్టర్లు ఆ గ్రామాన్ని సందర్శించారు. చంద్రగిరి వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ వీ.రమణ కుమార్, మల్లయ్యపల్లి వెటర్నరీ డాక్టర్ వినోద్ కుమార్ గ్రామంలోని నాటు కోళ్లు మృతిచెందిన ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించి.. కోళ్లను పరీక్షించారు. గ్రామ పరిసర ప్రాంతాలను కలియతిరిగారు. పంట పొలాలకు వేసిన మందుల వల్లనే ఇవి మృతి చెందాయి అని వైద్యులు నిర్ధారించారు. గ్రామస్థుల్లో ఉన్న అనుమానాలు తొలగిస్తూ ఈ కోళ్ల మృతికి బర్డ్ ఫ్లూ కారణం కాదని.. పంట పొలాలపై వేసిన మందుల వల్ల అక్కడ మేతకు వెళ్లి తిని చని పోతున్నాయని వెల్లడించారు. ఈ ప్రాంతంలో బర్డ్ ఫ్లూ లేదని ప్రజలు భయపడాల్సిన పని లేదని డాక్టర్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details