ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వెటర్నరీ వైద్యురాలి ఆత్మహత్య - చిత్తూరులో వెటర్నరీ డాక్టర్ ఆత్మహత్య వార్తలు

కుటంబ కలహాలతో ఓ వెటర్నరీ వైద్యురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చిత్తూరు దుర్గానగర్​ కాలనీలో జరిగింది.

veterinary doctor sucide in chittoor
veterinary doctor sucide in chittoor

By

Published : Jan 6, 2021, 9:02 AM IST

చిత్తూరులోని దుర్గానగర్ కాలనీకి చెందిన సుజిత (34), పలమనేరు కొలమాసనపల్లికి చెందిన మహేశ్​కు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మూడేళ్ల బాబు ఉన్నాడు. సుజిత యాదమరి మండలంలోని మాదిరెడ్డిపల్లిలో వెటర్నరీ వైద్యురాలిగా పనిచేశారు. మహేశ్​ కొలమాసనపల్లిలో పోస్టుమాస్టర్​గా విధులు నిర్వర్తిస్తున్నారు.

ఈ దంపతులు.. ఎంజీఆర్ విధిలో నివాసం ఉండేవారు. కొన్ని రోజులుగా భార్య భర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. సుజిత ఒంటరిగానే జీవిస్తోంది. ఈ క్రమంలో మంగళవారం ఆమె ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చిత్తూరు ఒకటో పట్టణ ఎస్సై మోహన్ కుమార్ తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details