శాస్త్రవేత్తలు చేసే పరిశోధనలు జీవన వికాసానికి తోడ్పడాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. చిత్తూరు జిల్లా గాదంకి జాతీయ వాతావరణ పరిశోధన సంస్థను ఆయన సందర్శించారు. డేటా కేంద్రం, ఎంఎస్టీ రాడార్, హెచ్ఎఫ్ రాడార్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ పరిశోధనలు చేసి వాతావరణ వివరాలు తెలపడం సంతోషకరమన్నారు. భూతాపం, వాతావరణ మార్పులు గమనిస్తూ పరిష్కార మార్గాలు అన్వేషించాలని సూచించారు. ప్రతి ఒక్కరి జీవితంలో నేర్చుకోవడం భాగం కావాలన్నారు. నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలని వెంకయ్యనాయుడు అన్నారు.
'నిత్యం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి' - గాదంకి
నేర్చుకోవడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమనీ.. అందరూ నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. చిత్తూరు జిల్లా గాదంకిలో జాతీయ వాతావరణ పరిశోధన సంస్థను ఆయన సందర్శించారు.

వెంకయ్యనాయుడు