శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి నైవేద్యం పెట్టిన లడ్డును ప్రసాదంగా భక్తులకు ఇవ్వాలని... బ్రాహ్మణ కార్పోరేషన్ మాజీఛైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య డిమాండ్ చేశారు. తితిదే ఛైర్మన్ సుబ్బారెడ్డి ఒంటెద్దు పోకడలతో స్వామివారి లడ్డు పవిత్రతను మంటగలిపే చర్యలకు పాల్పడటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఆగమశాస్త్ర విలువలను గుర్తించకపోవడం, కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీయటమేనని పేర్కొన్నారు. పెద్దమొత్తంగా శ్రీవారి ప్రసాదాలను అమ్ముకోవటం ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారని గుర్తుచేశారు. ఆలయ కట్టుబాట్లు, సంప్రదాయాలు తెలియని ఛైర్మన్ సుబ్బారెడ్డి... వెంటనే తన పదవికి రాజీనామా చెయ్యాలని ఆనంద్ సూర్య డిమాండ్ చేశారు.
' శ్రీవారి లడ్డు పవిత్రతను మంట గలుపుతున్నారు' - ttd updates
శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి నైవేద్యం పెట్టిన లడ్డును ప్రసాదంగా మాత్రమే భక్తులకు ఇవ్వాలని బ్రాహ్మణ కార్పోరేషన్ మాజీఛైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య పేర్కొన్నారు. తితిదే ఛైర్మన్... లడ్డు పవిత్రతను మంటగలుపుతున్నారని మండిపడ్డారు.
వేమూరి ఆనంద్ సూర్య