ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వార్షిక వసంతోత్సవాలకు ముస్తాబైన తిరుమల - lord venkateshwara

శ్రీ వెంకటేశ్వరస్వామి సన్నిధిలో వార్షిక వసంతోత్సవాలు నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. నేటి నుంచి మూడు రోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవాల కోసం... వసంత మండపాన్ని ప్రకృతి సోయగాలు ఉట్టిపడేలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

వార్షిక వసంతోత్సవాలకు ముస్తాబైన తిరుమల

By

Published : Apr 17, 2019, 6:12 AM IST

వార్షిక వసంతోత్సవాలకు ముస్తాబైన తిరుమల

వసంత రుతువును ఆహ్వానిస్తూ... చైత్ర పౌర్ణమి ముగింపు పలుకుతూ... శ్రీవారి సన్నిధిలో మూడు రోజులపాటు వసంతోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఇవాళ్టి నుంచి శుక్రవారం వరకు ఈ వేడుకలు నిర్వహించేందుకు పాలకమండలి, అధికారులు ఏర్పాట్లు చేశారు.
తిరువీధుల్లో ఊరేగింపు...
వసంతోత్సవాల్లో మొదటి రోజు... శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి వారు ఊరేగింపుగా వసంత మండపానికి చేరుకుంటారు. రెండో రోజు ఉభయ దేవేరులతో శ్రీవారు బంగారు రథంపై తిరు వీధుల్లో ఊరేగుతూ... వసంత మండపానికి వస్తారు. ఆఖరి రోజున... స్వామివారు అమ్మవారితోపాటు శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయస్వామి, శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ కృష్ణస్వామితో వసంతోత్సవంలో పాల్గొంటారు.
సర్వాంగ సుందరంగా వసంత మండపం...
వసంతోత్సవాలను శ్రీవారి ఆలయం వెనుక ఉన్న వసంత మండపాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పలు రకాల పుష్పాలతో ముస్తాబు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో...ప్రకృతి సోయగాలు ఉట్టిపడేలా... మండపాన్ని అలంకరించారు. వసంతోత్సవాన్ని... వన్య మృగాలు, పశుపక్ష్యాదులు తిలకించడానికి వచ్చాయా అన్నట్లు... సహజత్వంతో భారీ సెట్టింగ్​లు వేశారు.

ABOUT THE AUTHOR

...view details