ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వర్షాల కోసం.. తిరుమలలో కారిరీష్ఠి యాగం - undefined

వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతిలో రేపటినుంచి ఐదు రోజులపాటు కారిరీష్ఠి యాగాన్ని నిర్వహించనున్నారు. నిపుణులైన ఋత్వికుల సమక్షంలో ఈ వరుణ యాగం జరగనుంది.

వర్షాల కోసం.. తిరుమలలో కారిరీష్ఠి యాగం

By

Published : May 13, 2019, 7:13 PM IST

వర్షాల కోసం.. తిరుమలలో కారిరీష్ఠి యాగం
రాష్ట్రంలోను, దేశంలోనూ సకాలంలో వర్షాలు కురిసి సుభిక్షత నెలకొనాలని ఆకాంక్షిస్తూ తిరుమలలో కారీరిష్ఠి యాగంను నిర్వహించనున్నారు. రేపటి నుంచి ఐదు రోజుల పాటు తితిదేతో పాటు కంచిపీఠం సంయుక్తంగా ఈ వరుణ యాగం తలపెట్టనుంది. పాపవినాశనం రహదారిలోని పార్వేట మండపం వద్ద యాగం నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
కరవు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వర్షాలు సమృద్ధిగా కురిసి సుభిక్షత నెలకొనాలని వరుణదేవుని ప్రార్థిస్తూ తిరుమలలో కారీరిష్ఠి యాగంను నిర్వహించేందుకు తితిదే ఏర్పాట్లు చేస్తోంది. మంగళవారం నుంచి ఐదు రోజులపాటు గోగర్భం తీర్థం చెంత గల పార్వేట మండపంలో కారీరిష్ఠి యాగాన్ని తలపెట్టారు. వరుణయాగం నిర్వహణలో నిపుణులైన ఋత్వికుల సమక్షంలో ఈ యాగం జరగనుంది. యాగంలో భాగంగా 5 రోజుల పాటు ప్రముఖ పండితులచే తిరుమలలోని శ్రీ వరాహస్వామివారి ఆలయంలో ఋష్యశృంగ శ్లోక పారాయణము, ఆస్థాన మండపంలో మహాభారతంలోని విరాటపర్వం పారాయణం చేయనున్నారు.
తిరుమలలో నిర్వహించే కార్యక్రమాలతో పాటు తిరుపతిలోని కపిలేశ్వరస్వామివారి ఆలయంలో వరుణ జపం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 18వ తారీఖున పూర్ణాహుతి కార్యక్రమంతో యాగం ముగుస్తుంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details