ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిత్తూరు ఎస్పీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు..: వర్ల రామయ్య - ఏపీ తాజా వార్తలు

Varla Ramaiah letter to DGP: చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ డీజీపికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ రాశారు. ప్రత్యర్థి పార్టీలను బెదిరించడం, కస్టోడియల్ టార్చర్​ని రిషాంత్ అలవాటుగా మార్చుకున్నారని లేఖలో పేర్కొన్నారు. రిషాంత్ రెడ్డిపై కేసు రిజిస్టర్ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.

వర్ల రామయ్య
వర్ల రామయ్య

By

Published : Nov 25, 2022, 12:18 PM IST

Varla Ramaiah letter to DGP: చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ.. డీజీపీకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. ప్రత్యర్థి పార్టీలను బెదిరించడం, చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడుతున్నారని ఆక్షేపించారు. మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాలతో.. కుప్పం నియోజకవర్గంలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులుపెడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. రిషాంత్ రెడ్డిపై కేసు రిజిస్టర్ చేసి చర్యలు తీసుకోవాలని డీజీపికి విజ్జప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details