చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ పరిధిలో శుక్రవారం పలు పంచాయతీల్లో ఎమ్మెల్యే వెంకటే గౌడ పర్యటించి రైతు భరోసా కేంద్రాలకు భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. గంగవరం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే వెంట కార్యక్రమంలో పాల్గొన్న కలగటూరు పంచాయతీ కార్యదర్శి రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో అతన్ని పరామర్శించిన ఎమ్మెల్యే సంఘటన స్థలం నుంచి క్షతగాత్రుడిని పలమనేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే ఆవు తొక్కడంతో అనారోగ్యానికి గురై వృద్దుడు మరణించిన ఘటనలో మృతుని కుమార్తెను ఎమ్మెల్యే పరామర్శించి... బాధితురాలికి సియం సహాయనిధి ద్వారా మంజూరైన లక్ష రూపాయల చెక్కును అందచేశారు.
108 వాహనంలో ప్రసవం
పెద్దపంజని మండలం సుద్దాగుంటలపల్లి చెందిన నాగరాజు భార్య జయమ్మ పురిటి నొప్పులతో 108 కి ఫోన్ చేయగా వారు వచ్చి ఆస్పత్రికి తీసుకెళుతుంటే ... దారిలోనే ఆడబిడ్డ కు జన్మనిచ్చింది. 108 సిబ్బంది ఈఎంటి శివభూషణం ప్రథమ చికిత్స చేసి బాలింతను పలమనేరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు.
ఆసుపత్రి రెడ్ జోన్
పెద్దపంజాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఒక వైద్యాధికారికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో.. పీహెచ్‌సీని రెడ్ జోన్‌గా ప్రకటించారు. ఆరోగ్య కేంద్రం మూసివేసి శానిటైజ్ చేయిస్తున్నారు.
పలమనేరు నియోజకవర్గ పరిధిలో పలు కార్యక్రమాలు - Palamaner constituency news
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ పరిధిలో శుక్రవారం పలు పంచాయతీల్లో ఎమ్మెల్యే వెంకటే గౌడ పర్యటించి రైతు భరోసా కేంద్రాలకు భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. పెద్దపంజాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రెడ్ జోన్‌గా ప్రకటించారు.
పలమనేరు నియోజకవర్గ పరిధి