చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలోని తితిదే అనుబంధమైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు .వైకుంఠ ఏకాదశి కావడం. తిరుమలకు దర్శనం టోకెన్ ఉంటేనే అనుమతించటంతో ... సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మంగాపురంలోని స్వామివారిని దర్శించుకుంటున్నారు. వేకువజామున స్వామివారికి అర్చకులు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మాడవీధులు గోవింద నామస్మరణలతో మారుమ్రోగాయి. అధికారులు కొవిడ్ నిబంధనలు పాటించాలని భక్తులకు సూచనలు చేస్తున్నారు . వృద్ధులకు వికలాంగులకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేయకపోవడంపై భక్తులు పెదవి విరిచారు. తిరుమల తరహాలోనే శ్రీవారి లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు.
శ్రీనివాసమంగాపురంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
శ్రీనివాస మంగాపురంలో వెలసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే భక్తులతో ఆలయ పరిసర ప్రాంతం కిక్కిరిసింది. ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.
శ్రీనివాసమంగాపురంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు