వడదెబ్బ తగిలి 15 మంది గిరిజనులకు అస్వస్థత - vadadebba
వేసవి వడగాల్పులు గిరిజనులను తీవ్ర అస్వస్థతకు గురి చేస్తోంది. చిత్తూరు జిల్లా గోపాలపురంలో 15మంది గిరిజనులు వడదెబ్బ తగిలి ఆసుపత్రి పాలయ్యారు.
మండుతున్న ఎండలు, వడగాల్పుల ధాటికి పదుల సంఖ్యలో జనం అస్వస్థతకు గురవుతున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని అటవీ సమీప గ్రామమైన గోపాలపురంలో 15 మంది గిరిజనులు వడదెబ్బ తగిలి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులు పెద్దసంఖ్యలో ఉండటం సహా పరిస్థితి ప్రమాదకరంగా మారుతుండటంతో చంద్రగిరి ఏరియా ఆసుపత్రి నుంచి వైద్యులు తరలివెళ్లారు. తక్షణ చికిత్స అందించడం సహా సెలైన్ ఎక్కించి వివిధ పరీక్షలు నిర్వహించారు. వడదెబ్బ బారిన పడకుండా ఉండేందుకు వైద్యులు గిరిజనులకు పలు సూచనలు చేశారు.
TAGGED:
vadadebba