తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలోని వార్డు సచివాలయంలోని నామినేషన్ల కేంద్రాన్ని అర్బన్ ఎస్పీ వెంకట అప్పల నాయుడు పరిశీలించారు. గతంలో జరిగిన ఘటనల దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత ఏర్పాటు చేశామన్నారు. ఎస్పీ, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని ఆరు డివిజన్లలో ఆరుగురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు కోరితే వ్యక్తిగత భద్రతను సైతం కల్పిస్తామన్నారు. బలవంతపు ఉపసంహరణలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. వారికి ఎటువంటి ఇబ్బందులు, ఒత్తిళ్ళు ఎదురైనా తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు - తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికలు
గతంలో జరిగిన ఘటనల దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తిరుపతి నగరపాలక సంస్ధ నామినేషన్ల ప్రక్రియలో భద్రత ఏర్పాటు చేసినట్లు అర్బన్ ఎస్పీ వెంకట అప్పల నాయుడు తెలిపారు.
తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పల నాయుడు