ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉపాధి హామీ పనులతో కడుపు నింపుకుంటున్న కార్మికులు - కడుపు నింపుతున్న ఉపాధి హామీ పనులు

కరోనా వైరస్ ప్రభావంతో సామాన్యుడికి ఉపాధి కరవైంది. ఇలాంటి సమయంలో కూలీలకు ఉపాధి హామీ పథకం కడుపునింపుతోంది. కరోనా ఉద్ధృతి తగ్గే వరకు పని దినాలను పెంచాలని ఉపాధి హామీ కూలీలు వేడుకుంటున్నారు.

upadhi haami scheme
upadhi haami scheme

By

Published : Jun 20, 2020, 10:56 AM IST

కరోనాతో కరువు తాండవిస్తున్న సమయంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు.... ఉపాధి హామీ పనులు చేదోడుగా నిలిచాయి. దేశంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని రకాల పరిశ్రమలు కుదేలవడంతో కార్మికులు రోడ్డున పడ్డారు. ఇటువంటి సమయంలో సామన్య ప్రజలకు కూలీ దొరకని పరిస్థితి ఏర్పడింది. ఆకలితో అలమటిస్తున్న ప్రజలకు ఉపాధి హామీతో జీవనం పొంది కడుపు నింపుకుంటున్నారు. కరోనా ఉద్ధృతి తగ్గే వరకు పని దినాలను పెంచాలని ఉపాధి హామీ కూలీలు వేడుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details