చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యువతిపై దుండగులు అత్యాచారం చేశారు. పట్టణ శివారులోని చెత్త నిల్వ ప్రాంతంలో పురపాలక పారిశుద్ధ్య కార్మికులు మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా... డీఎస్పీ రామకృష్ణయ్య సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె శరీరమంతా కాలిపోయి ఉంది. కేసు నమోదు చేసి... నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
చెత్తకుప్పలో కాలిన మృతదేహం.. యూపీ యువతిది!
పొట్టకూటికోసం ఉత్తరప్రదేశ్ నుంచి శ్రీకాళహస్తి వచ్చిన ఓ కుటుంబం...పానీ పూరి వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇంతలో దుండగుల చేతిలో తమ బిడ్డ హత్యకు గురైందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
యూపీ కుటుంబం ఇక్కడేంటి
ఇటీవలే ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ కుటుంబం... శ్రీకాళహస్తిలో పానీ పూరి బండి నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం నుంచి తమ బిడ్డ పింకీ కనబడటం లేదని తల్లిదండ్రులు తెలిపారు. మృతదేహం విషయం తెలుసుకుని హూటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పింకీ మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. జీవనాధారం కోసం వేరే రాష్ట్రం నుంచి ఇక్కడకు వచ్చామని.. బిడ్డ ప్రాణాలు పోగొట్టుకున్నామని వాపోయారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు.