ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా కార్యకర్తపై దాడి... వైకాపా నేతల పనేనని ఆరోపణ - తిరుపతిలో తెదేపా కార్యకర్తపై దాడిని ఖండించిన పార్టీ నేత పట్టాభి

తిరుపతిలో తెదేపా కార్యకర్తపై కొందరు దుండగులు దాడికి దిగారు. దుకాణంలోని సామాగ్రిని ధ్వంసం చేసి.. బాధితుడి పళ్లు విరగకొట్టి, కాళ్లపై కొట్టారు. పరిస్థితిని పరిశీలించిన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టాభి.. వైకాపా నేతల మనుషులే దాడి చేశారని ఆరోపించారు.

unknown persons attack on tdp man at tirupati
తిరుపతిలో తెదేపా కార్యకర్తపై దుండగుల దాడి

By

Published : Mar 3, 2021, 9:35 AM IST

తిరుపతిలో తెదేపా కార్యకర్తపై దుండగుల దాడి

తెదేపా కార్యకర్తతో పాటు అతడి దుకాణంపై గుర్తు తెలియని వ్యక్తులు తిరుపతిలో దాడి చేశారు. ప్రకాశం పార్కు సమీపంలోని లోకేష్ నాయుడు దుకాణానికి ఆటోలో వచ్చిన దుండగులు.. ఒక్కసారిగా దాడికి దిగారు. సామగ్రిని ధ్వంసం చేయడంతో పాటు భౌతికంగా హింసించారు. బాధితుడి పళ్లు విరిగిపోయి.. కాళ్లకు బలమైన గాయాలయ్యాయి. 45వ డివిజన్ తెదేపా అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన చంద్రమోహన్​కు.. లోకేష్ నాయుడు ప్రపోజర్​గా నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు.

ఈ కారణంగానే వైకాపా నేతల మనుషులు దాడి చేశారని.. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టాభి ఆరోపించారు. కార్యకర్తలకు, అభ్యర్థులకు భద్రత కల్పించలేని పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఎస్ఈసీ జోక్యం చేసుకుని కేంద్రబలగాల ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగేలా చూడాలని కోరారు. ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు ఉన్నాయని తెలిపినా.. అలిపిరి స్టేషన్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేయలేదు.

ABOUT THE AUTHOR

...view details