చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పట్టణ పోలీసులు... మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగార్జున రెడ్డి తెలిపారు.