తిరుమల శ్రీవారి ఆశీస్సులతో ప్రజాసేవ చేసి మంచి పేరు తెచ్చుకుంటానని కేంద్ర హోంశాఖ సహయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ తిరుపతి పర్యటన సందర్భంగా రేణిగుంట చేరుకున్న ఆయనకు జిల్లా అధికారులు, భాజాపా నాయకులు ఘనస్వాగతం పలికారు. ప్రజల ఆశీస్సులతో కేంద్రంలో భాజాపా అధికారంలోకి వచ్చిందన్న ఆయన... శ్రీవారి ఆశీస్సుల కోసం ప్రధాని వస్తున్నారని తెలిపారు. పేద, మధ్యతరగతి ప్రజలను ప్రగతి పథంలో నడపిస్తామని పేర్కొన్నారు. భాజాపా మరోసారి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాం: కిషన్రెడ్డి - తిరుమల
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తమ పాలన అందిస్తారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రేణిగుంట విమానాశ్రమం సమీపంలోని కార్బన్ పారిశ్రామికవాడలో జరగనున్న మోదీ సభ సందర్భంగా... మంత్రి కిషన్ రెడ్డి రేణిగుంట వచ్చారు. సభ జరిగే ప్రదేశాన్ని పరిశీలించారు.
కిషన్రెడ్డి
Last Updated : Jun 9, 2019, 6:16 AM IST