ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Kanipakam: కాణిపాకం ఆలయంలో పాత రథ చక్రానికి నిప్పు

KANIPAKAM కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఆలయ సమీపంలోని గోడౌన్ పక్కన స్వామివారి రథానికి సంబంధించిన పాత చక్రాలను తగులబెట్టడం కలకలం రేపింది. కొన్ని సంవత్సరాల క్రితం తుప్పుపట్టిన రథం చక్రాలను గోడౌన్ పక్కన ఉంచినట్లు అధికారులు తెలిపారు.

కాణిపాకంలో స్వామివారి రథం పాత చక్రాలు తగులపెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు
కాణిపాకంలో స్వామివారి రథం పాత చక్రాలు తగులపెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు

By

Published : Jan 27, 2022, 12:19 PM IST

Updated : Jan 28, 2022, 5:17 AM IST

KANIPAKAM: కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఆలయ సమీపంలోని గోడౌన్ పక్కన స్వామివారి రథానికి సంబంధించిన పాత చక్రాలను తగులబెట్టడం కలకలం రేపింది. కొన్ని సంవత్సరాల క్రితం తుప్పుపట్టిన రథం చక్రాలను గోడౌన్ పక్కన ఉంచినట్లు అధికారులు తెలిపారు. వాటికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టినట్లు చెప్పారు. పాత రథ చక్రాలను తగులబెట్టడంపై హిందూ సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గురువారం కాలిన స్థితిలో గుర్తించిన అధికారులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు, ఆలయ పాలకమండలి ఛైర్మన్‌ ఎ.మోహన్‌రెడ్డి, ఇన్‌ఛార్జి ఈవో కస్తూరి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Last Updated : Jan 28, 2022, 5:17 AM IST

ABOUT THE AUTHOR

...view details