కరోనాతో మృతిచెందిన భర్తను మర్చిపోలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం పెనుమలంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బాబు మూడు నెలల కిందట కరోనాతో మృతిచెందాడు. అప్పటి నుంచి భార్య వాణి (33) రోజూ.. బాబునే గుర్తు చేసుకునేది. బాధపడుతూ ఉండేది. ఈ క్రమంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రుల మృతితో పిల్లలు చరిత్ (6), హేమంత్ (4) అనాథలయ్యాలు.
భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్య - latest news of chittoor
భర్త మూడు నెలల క్రితం కరోనా బారిన పడి చనిపోయాడు. అతని మృతిని భార్య తట్టుకోలేక పోయింది. రోజూ అతని గురించే ఆలోచించింది. మానసికంగా చాలా కుంగిపోయిన ఆమె.. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది.
![భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్య Unable to bear the death of her husband, the wife committed suicide in chittoor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13057568-411-13057568-1631591000656.jpg)
Unable to bear the death of her husband, the wife committed suicide in chittoor