చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం చంద్రగిరి కోటపైకి ట్రెక్కింగ్‌కు శనివారం మధ్యాహ్నం వెళ్లిన యువకులు దుర్గం కోనేరులో గల్లంతయ్యారు. ఈత కొట్టేందుకు ముగ్గురు యువకులు పుష్కరిణిలో దిగారు. వీరిలో శ్రీ రంగన్(27), అనుదీప్(23) గల్లంతవ్వగా.... మరో యువకుడు నితిన్(17) కోనేరు నుంచి బయటపడి క్షేమంగా ఇంటికి చేరాడు. తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పగా వారు చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కోనేరులో మునిగి... ఇద్దరు యవకులు మృతి
చంద్రగిరి కోటలోని దుర్గం గుట్టపైఉన్న పుష్కరిణిలో నీటమునిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. మరో యువకుడు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు.
పుష్కరిణిలో ఇద్దరు విద్యార్థుల మృతి
చంద్రగిరి ఎస్ఐ రామకృష్ణ సిబ్బందితో కోటపై ఉన్న దుర్గం కొనేరుకు చేరుకొని వారు మృతిచెందినట్లు నిర్ధరించారు. నీటిపై తెలుతున్న మృతదేహాలను గజఈతగాళ్ల సాయంతో బయటకు తీసి.... పోస్టుమార్థం నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలిస్తున్నారు. మృతులు తిరుపతి నగరంలోని ఖాదీ కాలనీకి చెందినవారుగా గుర్తించారు.
ఇదీ చదవండి:ఎమ్మెల్యే సాయం..రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలింపు