ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా నేతల వేధింపులు భరించలేక వాలంటీర్ల రాజీనామా - చిత్తూరు వార్తలు

అధికార పార్టీ నాయకుల వేధింపులు భరించలేక వాలంటీర్లు రాజీనామాలకు సిద్ధమవుతున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లె పంచాయతీలో వైకాపా నాయకుడి వేధింపులు తట్టుకోలేక ఇద్దరు గ్రామ వాలంటీర్లు రాజీనామాలు చేశారు.

Two volunteers resign after being abused by ycp leaders
చిత్తూరు జిల్లా అంకిశెట్టిపల్లిలో ఇద్దరు వాలంటీర్లు రాజీనామా

By

Published : Apr 30, 2020, 4:11 PM IST

ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో పేదలకు అందించాలన్న ఉన్నతమైన ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. వీరిపై అదే పార్టీకి చెందిన కొందరు నాయకులు వేధింపులకు పాల్పడటం, పైరవీలు చేయడం వంటివి చేస్తుండటంతో వాలంటీర్లు మానసిక వేధింపులకు గురై రాజీనామాలు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం అంకిశెట్టిపల్లి పంచాయతీలో వైకాపా నాయకుడి వేధింపులు తట్టుకోలేక ఇద్దరు వాలంటీర్లు రాజీనామా లేఖలను ఎంపీడీవోకు అందజేశారు.

చిత్తూరు జిల్లా అంకిశెట్టిపల్లిలో ఇద్దరు వాలంటీర్లు రాజీనామా

ABOUT THE AUTHOR

...view details