శేషాచలం అటవీ ప్రాంతంలో సుమారు రెండు కోట్ల విలువ చేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఎస్పీ రవిశంకర్ వెల్లడించారు. తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు జాడ ఉందన్న పక్కా సమాచారంతో డీఎస్పీ వెంకటయ్య బృందం కూంబింగ్ నిర్వహించినట్లు తిరుపతి టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో వివరించారు.
అటవీ అధికారులపై తిరుపతి పోలీసుల అసహనం... తమిళ స్మగ్లర్లు లేరని చెప్పడంపై అభ్యంతరం
తిరుపతి శేషాచల ఆటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇద్దరు ఎర్రచందన స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి సుమారు రెండు కోట్లు విలువచేసే ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఎస్పీ రవిశంకర్ తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు లేరని అటవీ శాఖ అధికారులు చేస్తున్న ప్రకటనను ఆయన తప్పుపట్టారు.
శేషాచలం అడవుల్లో భారీగా ఎర్రచందనం పట్టివేత
కూంబింగ్‌లో 40 మంది ఎర్ర చందన స్మగ్లర్లు కదలికలు గమనించి వెంబడించి ఇద్దరిని పట్టుకున్నట్లు తెలిపారు. వీరిలో ప్రభు అనే వ్యక్తి 2014లో జరిగిన ఫారెస్ట్ ఆఫీసర్ హత్య కేసులో నిందితుడని పేర్కొన్నారు. శేషాచలం అటవీ ప్రాంతంలో తమిళనాడుకు చెందిన ఎర్ర చందనం స్మగ్లర్లు లేరని.. ఫారెస్ట్ అధికారులే ప్రకటనలు చేయడం బాధాకరమన్నారు.
ఇవీ చూడండి...