ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శేషాచల అడవుల్లో ఇద్దరు స్మగ్లర్లు అరెస్ట్.. 24 ఎర్రచందనం దుంగలు స్వాధీనం - today Two smugglers arrested at shesachala forest news update

చిత్తూరు జిల్లా శేషాచల అడవులలోని తలకోన అడవుల్లో అటవీ శాఖ అధికారులు కుంబింగ్ నిర్వహించి.. ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 24 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు.

ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్
ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్

By

Published : May 12, 2021, 9:30 PM IST

శేషాచల అడవుల్లో అటవీశాఖ అధికారులు బుధవారం కుంబింగ్ నిర్వహించారు. తలకోన సెంట్రల్ బీట్ లోని ఎలమ చెట్లదడి వద్ద వారిని గుర్తించిన ఎర్రచందనం స్మగ్లర్లు.. దుంగలు పడవేసి దట్టమైన అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. పరిసర ప్రాంతాల్లో గాలింపులు చేపట్టిన అధికారులు ఇద్దరు స్థానిక స్మగ్లర్ల అరెస్ట్ చేశారు.

వారి నుంచి 24 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. పరారైన స్మగ్లర్ల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. పట్టబడ్డవారిని సోమల మండలానికి చెందిన చిన్న మల్లయ్య, యర్రావారిపాళ్యం మండలానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డిగా గుర్తించారు. కేసు దర్యాప్తు చేపట్టినట్లు ఎఫ్.ఎస్.ఓ నాగరాజు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details