ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒకే రోజూ.. రైటర్, అసిస్టెంట్ రైటర్ పదవీ విరమణ - chittoor district newsupdates

చంద్రగిరి పోలీస్​ స్టేషన్​లో రైటర్ సత్యనారయణ, అసిస్టెంట్ రైటర్ పురుషోత్తం రెడ్డి ఇద్దరు పదవీ విరమణ పొందారు. సహచర సిబ్బంది వారిని సన్మానించి వీడ్కోలు చెప్పారు.

Two policemen retire at Chandragiri police station
చంద్రగిరిలో ఇద్దరు పోలీసుల పదవీ విరమణ

By

Published : Feb 1, 2021, 9:59 AM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి పోలీస్​ స్టేషన్​లో ఇద్దరు ఉద్యోగులు పదవీ విరమణ పొందారు. రైటర్ సత్యనారయణ, అసిస్టెంట్ రైటర్ పురుషోత్తం రెడ్డి ఇద్దరూ.. ఒకేరోజు పదవీ విరమణ పొందగా.. ఆ పోలీస్​ స్టేషన్​లో సందడి నెలకొంది. సీఐ రామచంద్రరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన వీడ్కోలు కార్యాక్రమానికి డీఎస్పీ నరసప్ప ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఏ ఉద్యోగి అయినా పదవీ విరమణ పొందడం సహజమని డీఎస్పీ చెప్పారు. సుమారు మూడున్నర దశాబ్దాలు.. సమాజం కోసం అహర్నిశలు కష్టించి.. పదవీ విరమణ పొందుతున్న సిబ్బంది జీవితాలు సార్థకమని ప్రశంసించారు. పోలీస్ స్టేషన్ సిబ్బంది.. సీఐ శివ ప్రసాద్ తో కలిసి ఇద్దరిని ఘనంగా సన్మానించారు.

ABOUT THE AUTHOR

...view details