ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చంద్రగిరి మండలంలో ఇద్దరు వేటగాళ్లు అరెస్ట్ - chittoor district latest news

చిత్తూరు జిల్లాలోని శేషాచల అడవుల్లో జంతువులను వేటాడుతున్న ఇద్దరు వేటగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నాటు తుపాకీ, మందు గుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

చంద్రగిరి మండలంలో ఇద్దరు వేటగాళ్ల అరెస్ట్
చంద్రగిరి మండలంలో ఇద్దరు వేటగాళ్ల అరెస్ట్

By

Published : Sep 23, 2020, 6:03 PM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శేషాచల అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు ఇద్దరు వేటగాళ్లు చిక్కారు. వారి వద్ద నుంచి ఒక నాటు తుపాకీ, మందు గుండు సామగ్రి, మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు పారిపోగా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పట్టుబడ్డ వారు భాకరాపేటకు చెందిన మధు(45), ఎల్లమ్మగూడకు చెందిన రమణయ్య(48) గా పోలీసులు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి జ్యుడిషీయల్ రిమాండ్​కు తరలించినట్లు సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details