చిత్తూరు జిల్లా యర్రావారిపాళం మండలం బోడెవాండ్ల పల్లిలో ఇద్దరు యువకులు అనుమానస్పద స్థితిలో మరణించారు. ఈ రోజు ఉదయం స్థానికులు మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
మృతదేహాలను పంచనామా నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. మృతులను ఎర్రచందనం కూలీలుగా భావిస్తున్నారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.