ఈతరాక ఒకరు, కాపాడేందుకు యత్నించి మరొకరు ప్రాణాలు విడిచారు.. సరదాగా చేపలు పట్టేందుకు వెళ్లిన ఇద్దరు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందారు. చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం మాధవరం ఎస్సీ కాలనీకి చెందిన పట్టాభి, సుధాకర్, మరికొంతమంది.. తామన్న చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లారు. అయితే కంటిచూపు సరిగాలేని పట్టాభి.. అదుపుతప్పి చెరువులో పడ్డాడు. పట్టాభిని రక్షించేందుకు సుధాకర్(36) చెరువులో దూకాడు. ఈ క్రమంలో పట్టాభి సుధాకర్‌ను గట్టిగా పట్టుకోవడంతో ఇద్దరూ నీటి మునిగి బురదలో కూరుకుపోయినట్లు స్థానికులు తెలిపారు.
ఈతరాక ఒకరు, కాపాడబోయి మరొకరు.. చెరువులో మునిగి మృతి - Two persons died due to felt into a pond at madhavaram
సరదాగా చేపలు వేటకు వెళ్లిన ఇద్దరు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతిచెందారు. ఈతరాక ఒకరు, కాపాడేందుకు యత్నించి మరొకరు చెరువులో పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా మాధవరంలోని తామన్న చెరువులో జరిగింది.

చెరువులో మునిగి ఇద్దరు మృతి
అక్కడే ఉన్న సుధాకర్ కుమారుడు ధనుశ్ కేకలు వేయడంతో స్థానికులు వచ్చి ఇద్దరిని వెలికి తీశారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన వారిని చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే ఇద్దరూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సుధాకర్‌కు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు.
ఇదీ చదవండి..దంతెరపల్లి హత్యకేసులో నిందితుల అరెస్ట్