ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ఆత్మహత్యాయత్నం... ఇద్దరు మృతి - చిత్తూరు జిల్లా నేర వార్తలు

చిత్తూరు జిల్లాలో విషాదం నెలకొంది. కుమార్తెకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో కుమార్తె మరణించగా... తల్లి మృత్యువుతో పోరాడుతోంది. మరో ఘటనలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

two persons died and one person injured in differend suicide attempt actions in chithore district
వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ఆత్మహత్యాయత్నం... ఇద్దరు మృతి

By

Published : Jan 13, 2021, 3:43 AM IST

చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఓ తల్లి, తన కుమార్తెకు విషమిచ్చి తానూ ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనలో కుమార్తె మరణించగా.. ఆమె ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఎర్రపల్లికి చెందిన సరస్వతికి హేమలత అనే కుమార్తె ఉంది. ఈమె మానసిక వికలాంగురాలు. ఆమె పరిస్థితి చూసి తల్లి మనో వేదనకు గురయ్యేదని స్థానికులు చెబుతున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఈ ఘటనకు పాల్పడినట్లు చెబుతున్నారు. అలాగే మదనపల్లి మండలం బసినికొండలో ఎనిమిదో తరగతి చదువుతున్న షాహినా అనే విద్యార్థిని ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఈ ఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది.
ఇదీచదవండి.

ముగ్గుల పోటీలతో ముందే వచ్చిన సంక్రాంతి...

ABOUT THE AUTHOR

...view details