ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అతి వేగం ఆ ఇద్దరి యువకుల ప్రాణం తీసింది - severe road accidents in chittor

అతి వేగంగా ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొని ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అతి వేగం ఆ ఇద్దరి యువకుల ప్రాణం తీసింది
అతి వేగం ఆ ఇద్దరి యువకుల ప్రాణం తీసింది

By

Published : Feb 15, 2020, 6:09 AM IST

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి
చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కొలమాసనపల్లి వద్ద శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వేగంగా వస్తోన్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొని ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పలమనేరు - కుప్పం జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో జీడినెల్లూరు చెందిన ప్రదీప్, పలమనేరుకు చెందిన ఆది అనే మరో యువకుడు ప్రాణాలు కోల్పోయారు. గ్రామస్థుల సహకారంతో ఇద్దరి మృతదేహాలను పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పలమనేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details