ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మదనపల్లెలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్టు - two town police station madanapalle

చిత్తూరు జిల్లా మదనపల్లెలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్​ చేశారు. బయటి ప్రాంతాల నుంచి అక్రమంగా గంజాయి అమ్ముతున్నట్టు పోలీసులు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు.

two people arrested for selling cannabis
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్టు

By

Published : Dec 23, 2020, 8:25 PM IST

బయటి ప్రాంతాల నుంచి అక్రమంగా గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను మదనపల్లె రెండో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణంలోని చంద్ర కాలనీకి చెందిన లక్ష్మన్న, రామాచారిపల్లికి చెందిన ముని స్వాములు భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తున్నారు. బయట ప్రాంతాల నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తుండగా రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 224 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details