ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రమాదవశాత్తు బావిలో పడి.. ఇద్దరు మృతి - two fell in well and died

చిత్తూరు జిల్లాలో బావిలో పడి ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనతో ఒక్కసారిగా మృతుల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అటవీశాఖాధికారులు బావిలోని శవాలను వెలికితీశారు.

two peolpe dead by accidentally falling in a well at chittoor forest area
ప్రమాదవశాత్తు బావిలో పడి.. ఊపిరాడక ఇద్దరి మృతి

By

Published : Feb 23, 2021, 4:07 AM IST

చిత్తూరు జిల్లా పీలేరు మండలం థానావడ్డిపల్లె గ్రామ శివారు అటవీ ప్రాంతంలో ఉన్న బావిలో దాహార్తి తీర్చుకునేందుకు వెళ్లిన రెడ్డి శేఖర్ (13) అనే బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. అక్కడే ఉన్న కొండమ్మ(28) అనే మహిళ.. బాలుడిని కాపాడేందుకు బావిలో దూకింది. ఇద్దరూ మృతి చెందారు.

బావిలో నుంచి మృతదేహాలను అటవీ శాఖాధికారులు బయటకు తీశారు. మృతులు పశువుల కాపరులుగా తెలుస్తోంది. గ్రామానికి చెందిన ఇద్దరు మృతి చెందటంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details