సమాజంలో రోజురోజుకూ హింసాకాండ పెచ్చుమీరుతోంది.. నిత్యం ఏదో ఒకచోట మారణకాండలు, హత్యోదంతాలు జరుగుతూనే ఉన్నాయి.. పగలతో కొందరు హత్యలు చేస్తున్నారు... క్షణికావేశంలో మరికొందరు దాడులతో ప్రాణాలను బలి తీసుకుంటున్నారు... తాజాగా చిత్తూరు జిల్లాలో ఇద్దురు వ్యక్తులను గుర్తు తెలియని వ్యక్తి హత్య చేశాడు.
చిత్తూరు జిల్లాలో ఇద్దరి దారుణ హత్య! - చిత్తూరు జిల్లా తాజా వార్తలు
10:06 May 21
దారుణ హత్య!
జిల్లాలోని సదుం మండలం ఎగువ జాండ్రపేటలో దారుణం జరిగింది. ఇద్దరు వ్యక్తులను మే 20న రాత్రి గుర్తు తెలియని వ్యక్తి బండరాయితో కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. మృతులు వాటర్ ప్లాంట్‌లో పనిచేస్తున్న అనంతపురానికి చెందిన రాధ, వెంకటరమణగా గుర్తించారు.
మదనపల్లె సమీపంలోని అంగళ్లు ప్రాంతానికి చెందిన రాధారాణి, వెంకటరమణ, రాము ముగ్గురు నెల రోజులుగా వాటర్ ప్లాంట్లో పనిచేస్తున్నారు. రాధారాణి, వెంకటరమణ హత్యకు గురవ్వగా... రాము పరారయ్యాడు. దీంతో అతడే వీరిని హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. రాధారాణికి అనంతపురం జిల్లాలోని కొత్తచెరువు వ్యక్తితో వివాహమైందని.. నాలుగు నెలల క్రితం విడిపోయారని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఎగువ జాండ్రపేటకు తన సొదరుడు వెంకటరమణ, మిత్రుడు రాముతో కలిసి వచ్చి వాటర్ ప్లాంటులో పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. హత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి: