ROAD ACCIDENT: చిత్తూరు నగరంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. నగరంలోని కట్టమంచికి చెందిన సంతోశ్, సురేశ్ ఇద్దరు స్నేహితులు. వీరు ద్విచక్ర వాహనంలో మురకంబట్టుకు పని నిమిత్తం వెళ్లి తిరిగి ఇంటికి బయలుదేరారు.
చిత్తూరు - తిరుపతి రహదారి మురుకంబట్టు సమీపంలోని వంతెనపై ఆర్టీసీ బస్సు వీరి వాహనాన్ని ఢీ కొట్టింది.
ROAD ACCIDENT: మృత్యు శకటమైన ఆర్టీసీ బస్సు.. ఇద్దరు దుర్మరణం - chittoor crime news today
ROAD ACCIDENT: చిత్తూరు నగరంలో ఆర్టీసీ బస్సు ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. దీనిపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ROAD ACCIDENT
ఈ ప్రమాదంలో యువకులు ఇద్దరికీ తీవ్రంగా గాయాలు కావడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. సురేశ్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తుండగా.. మరో యువకుడు సంతోశ్ ప్రైవేటుగా పనులు చేసుకుంటూ ఉండేవాడు. వీరిద్దరికీ వివాహాలై భార్యా పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:TDP LEADER ON PEDDIREDDY: ఆక్రమ గనుల తవ్వకాలతో పెద్దిరెడ్డి కోట్లు కూడబెట్టారు: నల్లారి కిషోర్