తమిళనాడు రాష్ట్రం పల్లిపట్టు సమీపంలోని ఈశంబాడి కాలనీకి చెందిన ఇద్దరు వ్యక్తులు.. సోమవారం రాత్రి ద్విచక్రవాహనంపై శ్రీరంగరాజపురం వెళ్లారు. అక్కడ పనులు పూర్తి చేసుకుని తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా లక్ష్మీపురం పెట్రోల్ బంక్ వద్ద చిత్తూరు-పుత్తూరు ప్రధాన రహదారిపై ఆగి ఉన్న లారీని వెనక నుంచి బలంగా ఢీ కొట్టారు.
ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న శ్రీరంగరాజపురం పోలీసులు... సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టి మృతులు తమిళనాడు ప్రాంతం ఈశంబాడి కాలనీకి చెందిన కిషోర్, సంపత్ గా గుర్తించారు.