చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు నీటికుంటలో పడి మృతి చెందారు. పట్టణంలోని రామారావు కాలనీలో నివాసముంటున్న నాగరాజు, రజియాకు ముగ్గురు కుమార్తెలు. తల్లి రజియా సాయంత్రం సమయంలో సమీపంలో ఉన్న లింగిశెట్టి చెరువు వద్ద బట్టలు ఉతకటానికి వెళ్లింది. తల్లితో పాటు వచ్చిన ముగ్గురు కుమార్తెలు చెరువు సమీపంలో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు సమీర, ఆసీఫా అనే ఇద్దరు చిన్నారులు నీటి కుంటలో పడిపోయారు. పిల్లలు కనిపించకపోవటంతో తల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నవారితో చిన్నారులు కనిపించటంలేదని వేడుకుంది. సమీపంలో ఉన్న వారు నీటి గుంటలో గాలింపు చర్యలు చేపట్టగా ఇద్దరు పిల్లలు శవాలుగా కనిపించారు. చిన్నారుల మృతదేహాల వద్ద తల్లిదండ్రులు విలపిస్తున్న ఘటన అందరిని కలిచివేసింది. మృతదేహాలను మదనపల్లి ప్రభుత్వాపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమెదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మదనపల్లిలో విషాదం.. చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి - చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు చెరువు వద్దనున్న నీటి గుంటలో పడి మృతి చెందారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లి శివారులో చోటుచేసుకుంది. చిన్నారుల మృతదేహాల వద్ద తల్లిదండ్రులు విలపిస్తున్న ఘటన అందరిని కలిచివేసింది.
చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి