ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు..ప్రాథమిక చికిత్స చేసి ఆస్పత్రికి తరలించిన గురుమూర్తి - two injured person rushed to hospital by gurumurthy

తిరుపతి పార్లమెంట్‌ వైకాపా అభ్యర్థి గురుమూర్తి మానవత్వం చాటుకున్నారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు-వెంకటగిరి ప్రధాన రహదారిపై జరిగిన ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు.

two injured person rushed to hospital by gurumurthy
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

By

Published : Apr 14, 2021, 10:37 PM IST

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరిని ఆస్పత్రికి తరలించి తిరుపతి పార్లమెంట్‌ వైకాపా అభ్యర్థి గురుమూర్తి, ఎంపీ గోరంట్ల మాధవ్‌ మానవత్వం చాటుకున్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఎంపీ మాధవ్‌తో కలిసి గురుమూర్తి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి వెళ్తుండగా ఏర్పేడు-వెంకటగిరి ప్రధాన రహదారిపై ప్రమాదానికి గురైన ఇద్దరిని గుర్తించారు. వెంటనే ప్రాథమిక చికిత్స అందించారు. 108 ద్వారా ఆస్పత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details