చిత్తూరు జిల్లాల తొట్టంబేడు మండలం లింగంనాయుడు పల్లె వద్ద పూతలపట్టు-నాయుడుపేట రహదారిపై ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మృతులిద్దరూ నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన పవన్, బాలకృష్ణగా పోలీసులు గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృతి - లింగాయపల్లె రోడ్డు ప్రమాదం అప్డేట్ వార్తలు
చిత్తూరు జిల్లా లింగంనాయుడు పల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
![గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృతి two died in road accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9576442-417-9576442-1605666896695.jpg)
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి