ఎదురెదురుగా వస్తున్న రెండు ద్వి చక్ర వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. చిత్తూరు జిల్లా కదిరి మున్సిపాలిటీలో ఈ ప్రమాదం జరిగింది. ఆ యువకులు నగరిలో 15వ వార్డుకు చెందినవారిగా తెలుస్తోంది. ఇదే ఘటనలో మరో ముగ్గురికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి - నగరి రోడ్డు ప్రమాదంలో యువకుల మృతి
చిత్తూరు జిల్లా నగరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వీరిని ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొట్టడంలో ఈ ప్రమాదం జరిగింది.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి