తంబళ్లపల్లె, కన్నె మడుగు, రేణుమాకులపల్లి, గ్రామాలను రెడ్ జోన్లుగా ప్రకటించి, ముమ్మరంగా కరోనా నివారణ చర్యలు చేపట్టారు. మండల కేంద్రంలో ఆదివారం పూర్తిగా లాక్డౌన్ విధించారు. మృతులతో కలిపి మండలంలో మూడు పాజిటివ్ కేసులు నమోదైనట్లు మండల వైద్యాధికారి నిరంజన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు లాక్డౌన్ నిబంధనలు పాటించాలని వైరస్ నియంత్రణకు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. కర్ణాటక, మదనపల్లె, తిరుపతి, ఇతర ప్రాంతాలకు అత్యవసర సమయాల్లో రాకపోకలు సాగించేవారు తగు జాగ్రత్తలు పాటించి కరోనా వ్యాప్తి చెందకుండా సహకరించాలని అధికారులు కోరుతున్నారు.
తంబళ్లపల్లెలో ఒకే రోజు రెండు కరోనా మరణాలు.. సంపూర్ణ లాక్డౌన్ - chittoor district full lock down latest news
చిత్తూరులో కరోనా కేసులు రోజురోజుకు విజృంభిస్తున్నాయి. జిల్లాలో అత్యంత వెనుకబడిన తంబళ్లపల్లెలో మొన్నటి వరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా లేకుండా రికార్డులకెక్కింది. ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. తిరుపతిలో కరోనా బారినపడిన ఓ మహిళ తీవ్ర అస్వస్థతతో స్వగ్రామమైన కె. రామిగానిపల్లెలో మృతి చెందింది. మరో వృద్ధుడు అదే రోజు కరోనాతో కన్నుమూశాడు. ఒకే రోజు గ్రామలో రెండు మరణాలు సంభవించడం అధికారులు అప్రమత్తమయ్యారు.
తంబళ్లపల్లెలో ఒకే రోజు రెండు కరోనా మరణాలు