చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం చిన్నారిదొడ్డి గ్రామంలో దారుణం జరిగింది. పెంపుడు శునకానికి స్నానం చేయించబోయి... నీటిలో మునిగి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. గ్రామానికి చెందిన సుబ్రమణ్యం మంజుల దంపతులకు ఇద్దరు కుమార్తెలు దేవిశ్రీ(12), శిల్ప(10). చిన్నారులిద్దరు సరదాగా నానమ్మతో కలసి గొర్రెల మేపటానికి పొలానికి వెళ్లారు. తమతో పాటు వారి పెంపుడు శునకాన్ని తీసుకెళ్లారు. కాసేపు దానితో ఆడుకున్నాక... శునకానికి స్నానం చేయించటానికి గ్రామ సమీపాన ఉన్న చింతమాను కుంట చెరువు వద్దకు తీసుకెళ్లారు. కుక్కను శుభ్రం చేస్తున్న సమయంలో ప్రమాదవ శాత్తు నీటిలో మునిగి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
శునకాన్ని కడగబోయి... చిన్నారులు మృతి - children died news in chittoor district
ఇద్దరు అక్కచెల్లెల్లు సరదాగా గడపటానికి నానమ్మతో పాటు గొర్రెలను మేపటానికి వెళ్లారు. వారితో పాటు వారికి ఇష్టమైన శునకాన్నితీసుకెళ్లారు. కాసేపు దానితో ఆడుకున్నారు. అనంతరం శునకానికి స్నానం చేయించాలనుకున్నారు. సమీప చెరువు వద్దకు తీసుకెళ్లారు. శునకాన్ని చెరువులో దింపి... స్నానం చేయిస్తుండగా ప్రమాదవ శాత్తు ఇద్దరు బాలికలు నీటిలో ముగిని చనిపోయారు. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది.
చిన్నారులు మృతి