చిత్తూరు జిల్లా బి.కే.పల్లి ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్న గురునాథ్, సుజాత దంపతులకు అశ్విని, యశ్వంత్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాలనీ సమీపంలో ఉన్న నీటి గుంతోలో బట్టలు ఉతకటానికి వెళ్లిన సుజాత... తన పిల్లలను కూడా వెంట తీసుకెళ్లింది. ప్రమాదవశాత్తు బాలుడు నీటి గుంటలో పడిపోయాడు. గమనించిన తల్లి వెంటనే దిగి కొడుకుని కాపాడుకునే ప్రయత్నం చేయగా... కూతురు కూడా తల్లితో పాటు నీటిలోకి దూకేసింది. ఈ ఘటనలో చిన్నారులు ఇద్దరూ మృతి చెందారు. పిల్లలను కాపాడుకోలేకపోయానని ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది. పోలీసులు కేసు నమోదు చేశారు.
నీటి గుంతలో పడి అక్కాతమ్ముడు మృతి - two children dead at chittor
చిత్తూరు జిల్లా మదనపల్లి సమీపంలో ఇద్దరు చిన్నారులు నీటి గుంతలో పడి మృతి చెందారు. పిల్లలను కాపాడేందుకు తల్లి ప్రయత్నించినా.. ఫలించలేదు. కళ్ల ముందే ఆ చిన్నారులు శవాలై తేలారు.
నీటి గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి