ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Death: ఈత కోసం బావి వద్దకు వెళ్లిన అన్నదమ్ములు మృతి - two brothers died went for swimming at chittor

చిత్తూరు జిల్లా గుడిపాల మండలం నారగల్లులో విషాదం నెలకొంది. నారగల్లుకు చెందిన ఇద్దరు అన్నదమ్ములు బావిలోకి దిగి మరణించారు. వీరిద్దరికీ ఈత సరిగ్గా రాకున్నా.. బావిలోకి దిగి ప్రాణాలు తీసుకున్నారు. అన్నదమ్ముల మృతితో.. కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

two brothers died went for swimming in a well at naragallu
బావిలోకి దిగి అన్నదమ్ములు మృతి

By

Published : Jul 5, 2021, 10:36 PM IST

చిత్తూరు జిల్లా గుడిపాల మండలం నారగల్లులో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అన్నదమ్ములు ఇద్దరు ఈత రాక బావిలోకి దిగి మృత్యవాతపడ్డారు. గ్రామానికి చెందిన ప్రత్యేశ్, వినీత కుమారులు ఎన్రిన్ (10), ఎబినేశన్ (12) సరదాగా ఈత కొట్టడానికి గ్రామ సమీపంలోని బావిలోకి దిగారు.

అయితే.. ఈత పూర్తిగా రాకపోవడంతో.. అన్నదమ్ములిద్దరూ నీటిలో మునిగిపోయారు. అటువైపు వెళ్లేవారు మృతదేహాలను గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఒకే కుటుంబంలో ఇద్దరు పిల్లలు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details