ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుర్తు తెలియని మహిళ హత్య కేసులో ఇద్దరి అరెస్ట్ - సీనప్పగారి పల్లెలో నేర వార్తలు

చిత్తూరు జిల్లా కంభంవారిపల్లి మండలంలో 20 రోజుల క్రితం చనిపోయిన గుర్తు తెలియని మహిళ కేసును పోలీసులు ఛేదించారు. నిందితులైన ఇద్దరిని అరెస్ట్ చేశారు. అప్పు తిరిగి ఇవ్వమన్నందుకే ఆమెను చంపారని పోలీసులు తెెలిపారు.

Two arrested in unidentified woman murder case in Seenappagari  palle
పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు

By

Published : Mar 31, 2021, 1:50 PM IST

చిత్తూరు జిల్లా కంభంవారిపల్లి మండలంలో ఇటీవల జరిగిన గుర్తు తెలియని మహిళ హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు చిత్తూరు జిల్లా అదనపు ఎస్పీ నిశాంత్ రెడ్డి తెలిపారు. కే.వీ.పల్లి మండలం గ్యారంపల్లె పంచాయతీ సీనప్పగారి పల్లె సమీపంలోని ఎలుగుబండపై ఇరవై రోజుల క్రితం గుర్తుతెలియని మహిళశవాన్ని కాల్చివేసిన స్థితిలో పోలీసులు కనుగొన్నారు. కేవీ పల్లి సీఐ నాగార్జునరెడ్డి, ఎస్సై రామ్మోహన్ కేసు నమోదు చేసి.. విచారణ చేపట్టారు. పీలేరు పట్టణం శివారులోని చేనేత కాలనీకి చెందిన నీలావతి అలియాస్ నాగమల్లేశ్వరి గత ఇరవై రోజుల కనిపించట్లేదని గుర్తించారు. హత్య గురైన మహిళ ఆమె అని నిర్ధారించారు.

ఎర్రవారిపాలెం మండలం బసిరెడ్డిగారి పల్లెలో నివసిస్తున్న నీలావతి తల్లిదండ్రులను విచారించారు. తమ కుమార్తె గ్యారంపల్లి పంచాయతీ శీనప్పగారిపల్లికి చెందిన మల్లికార్జున అనే వ్యక్తితో సహజీవనం చేస్తూ ఉండేదన్నారు. ఈ క్రమంలో మల్లికార్జున, నీలావతి నుంచి రూ. 7 లక్షలు అప్పుగా తీసుకున్నాడని, డబ్బులు తిరిగి చెల్లించాలని కోరడంతో ఆమెనే చంపేందుకు పథకం వేశాడని తెలిపారు. ఈ నెల ఒకటవ తేదీని తన పొలం వద్దకు నీలావతిని తీసుకెళ్లాడు. అక్కడ వారిద్దరికి మాటా మాటా పెరగడంతో ఆగ్రహించిన మల్లికార్జున ఆమె తలపై బండరాయితో మోది చంపాడని తెలిపారు.

కొండ రాళ్ల మధ్యలోకి శవాన్ని తీసుకుని వెళ్లి.. పెట్రోల్ పోసి కాల్చాడు. హత్యకు గురైన లీలావతి ఇంటి తాళం పగలగొట్టి.. ఇంటిలో ఉన్న జేసీబీ ఆర్​సీ, చెక్ బుక్​ను తీసుకున్నాడు.
తన స్నేహితుడైన సోమలకు చెందిన వేణుకు నీలావతి ఫోనును ఇచ్చాడు. ఎవరైనా ఫోన్ చేసి ఆడిగితే నా పేరు బాషా.. మా ఊరు కడప.. అని నీలావతిని నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్పమని అతనికి తెలిపాడు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ కేసులో మొదటి ముద్దాయిని గ్యారంపల్లె సమీపంలో, రెండో ముద్దాయిని అతని ఇంటి వద్ద అరెస్టు చేసినట్లు పోలీసులు వివరించారు. రెండో ముద్దాయి వేణు గతంలో తన పెదనాన్నను హత్య చేసి జైలుకు వెళ్లి ఇటీవలే విడుదలయ్యాడు. ఈ కేసు ఛేదించడంలో కృషిచేసిన సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.

ఇదీ చూడండి.ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తండ్రి ఉరేసుకుని ఆత్మహత్య

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details