ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భాకరాపేట అడవుల్లో టాస్క్ ఫోర్స్ దాడులు.. 20 ఎర్రచందనం దుంగలు స్వాధీనం - చిత్తూరు జిల్లా తాజా వార్తలు

చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం దేవరకొండ అడవులలో ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లను టాస్క్​ ఫోర్స్​ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 20 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నామని.. పరారీలో ఉన్న దొంగల కోసం గాలింపు చేపట్టినట్లు టాస్క్ ఫోర్స్ ఎస్పీ ఆంజనేయులు తెలిపారు.

Task force police raids Bhakarapeta forest
భాకరాపేట అడవుల్లో టాస్క్ ఫోర్స్ దాడులు.. 20 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

By

Published : Nov 11, 2020, 8:00 PM IST

చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట అడవుల్లో ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లను టాస్క్​ ఫోర్స్​ బృందం పట్టుకున్నారు. భాకరాపేటలో శేషాచలం అడవుల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు తీవ్ర గాలింపు చేపట్టారు. మంగళవారం అర్ధరాత్రి దేవరకొండ బీట్ పరిధిలో దాదాపు 25 మంది స్మగ్లర్లు.. ఎర్రచందనం దుంగలు మోసుకు రావడాన్ని గుర్తించినట్లు టాస్క్ ఫోర్స్ ఎస్పీ ఆంజనేయులు తెలిపారు.

'తమ టీమ్ స్మగ్లర్లను పట్టుకునే ప్రయత్నం చేయగా.. స్మగ్లర్లు దుంగలను అక్కడే పడేసి పారిపోయారు. దొంగలను వెంబడించగా ముగ్గురు పట్టుబడ్డారు. వాళ్ల నుంచి 20 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నాం. పట్టుబడిన ముగ్గురు తమిళనాడుకు చెందిన వాళ్లుగా గుర్తించాాం. నాగరాజు, ఆండీనాటర్ అనే వ్యక్తులు తమను తీసుకుని వచ్చినట్లు విచారణలో వాళ్లు అంగీకరించారు' అని ఎస్పీ అంజనేయులు తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. సీఐ సుబ్రహ్మణ్యం నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details