ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వ్యవసాయానికి విద్యుత్ మీటర్లు.. రైతుల మెడకు ఉరితాళ్లే' - ap congress latest news

వ్యవసాయ విద్యుత్​ వినియోగానికి మీటర్లు అమర్చడం రైతుల మెడకు ఉరితాళ్లు బిగించడమే అవుతుందని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి పేర్కొన్నారు. మీటర్ల ఏర్పాటు పేరుతో ప్రభుత్వం అవినీతికి పాల్పడాలని చూస్తోందని ఆరోపించారు. నాడు అమరావతిని రాజధానిగా అంగీకరించిన జగన్... ఇప్పుడెందుకు 3 రాజధానులు అంటున్నారని ప్రశ్నించారు. తులసిరెడ్డి ఇవాళ చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించారు.

tulasi-reddy-fires-on-jagan-over-new-meters
తులసిరెడ్డి

By

Published : Sep 11, 2020, 8:45 PM IST

వ్యవసాయపు విద్యుత్ వినియోగానికి మీటర్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం రైతుల మెడకు ఉరితాడు బిగించినట్టే అవుతుందని... కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి వ్యాఖ్యానించారు.

చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించిన ఆయన.. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు ఏర్పాటు చేయడం ఉచిత విద్యుత్​కు స్వస్తి పలికినట్లు అవుతుందని పేర్కొన్నారు. విద్యుత్ మీటర్ల ఏర్పాటు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రూ.11 వేల కోట్లను ఆదాయంగా మలుచుకునేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు. నాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉండాలని ఆమోదించిన జగన్... నేడు మాట తప్పి మూడు రాజధానుల ఏర్పాటుకు నిర్ణయించడం దారుణమన్నారు.

విశాఖను పాలనా రాజధానిగా ఏర్పాటు చేసినా... న్యాయస్థానంలో వీగిపోతుందని తులసిరెడ్డి జోస్యం చెప్పారు. శాంతిపురం మండలంలో ఇటీవల విద్యుదాఘాతంతో చనిపోయిన జనసేన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. ద్రవిడ విశ్వవిద్యాలయంలో ఉద్యోగాల కోసం దీక్షలు చేస్తున్న వారికి సంఘీభావం ప్రకటించారు.

ఇదీ చదవండీ... వాతావరణం: ఉభయ గోదావరి, విశాఖ జిల్లాలకు పిడుగుల హెచ్చరిక

ABOUT THE AUTHOR

...view details