తిరుపతి మరింత స్మార్ట్.... ఆకట్టుకోనున్న హంగులు - ఆకర్షణీయ నగరాలు
ఆకర్షణీయ జాబితాలో ఉన్న నగరాల అభివృద్ధిలో తిరుపతి శరవేగంగా దూసుకెళ్తోందని... తుడా వైస్ ఛైర్మన్ అభిప్రాయపడ్డారు. . ఇప్పటి కొన్ని పనులు పురోగతిలో ఉన్నాయని... మరికొన్ని కార్యరూపంలోకి రానున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
![తిరుపతి మరింత స్మార్ట్.... ఆకట్టుకోనున్న హంగులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3665364-855-3665364-1561520454667.jpg)
ఆకర్షణీయ నగరాల జాబితాలో....తిరుపతి గణనీయమమైన పురోగతి సాధిస్తోందని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ-తుడా వైస్ ఛైర్మన్ పీఎస్ గిరీషా అభిప్రాయపడ్డారు. తుడా కార్యాలయంలో అధికారులతో కలిసి కేంద్రమంత్రి హర్‌దీప్ సింగ్‌పురి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. గిరీషా... ఆకర్షణీయ నగరాల ప్రాజెక్ట్ ప్రారంభమైన నాలుగేళ్లు పూర్తి చేసుకుందని తెలిపారు. మొత్తం 1800 కోట్ల రూపాయల నిధులతో తిరుపతిలో 57 స్మార్ట్ ప్రాజెక్ట్ లు చేపట్టామన్న ఆయన... స్మార్ట్ స్కూళ్లు, సౌరవిద్యుత్, భూగర్భ కేబులింగ్ వ్యవస్థ, ఎలివేటెడ్ స్మార్ట్ కారిడార్‌లతో తిరుపతి జాబితాలో 17వ స్థానంలో కొనసాగుతోందన్నారు. నగరాన్ని మరింత అభివృద్ధి చేయటం ద్వారా... స్మార్ట్ సిటీ జాబితాలో మెరుగైన స్థానాన్ని కైవసం చేసుకుంటామన్నారు.