ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వేద మంత్రోచ్ఛరణతో రోగ వినాశనం' - TTD YAGALU

భగవంతుడి నామస్మరణతో నయం కాని రోగాలు ఉండవని.. వేద మంత్రోచ్ఛరణలోని శబ్ధాలకు ఎంతో శక్తి ఉందని శ్రీ వెంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి విభీషణశర్మ పేర్కొన్నారు.

TTD YAGALU
మానవాళి ఆరోగ్యం కోసం తితిదే యాగాలు

By

Published : Mar 17, 2020, 1:20 PM IST

మానవాళి ఆరోగ్యం కోసం తితిదే యాగాలు

శ్రీ‌వారి ఆశీస్సుల‌తో ప్రపంచానికి సంపూర్ణ ఆరోగ్యాన్ని, శాంతి సౌభాగ్యాల‌ను ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ తితిదే యాగాలను నిర్వహిస్తోంది. సోమవారం శ్రీ శ్రీ‌నివాస వేద‌మంత్ర ఆరోగ్య జ‌పయ‌జ్ఞాన్ని పండితులు ప్రారంభించారు. తొమ్మిది రోజుల పాటు రోజుకు ఆరు గంటల పాటు 30 మంది వేద పండితులతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 25వ తేదీన చ‌తుర్వేద పారాయ‌ణం.. 26 నుంచి మూడు రోజుల పాటు శ్రీ శ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగం నిర్వహించేందుకు ధర్మగిరిలో ఏర్పాట్లు చేస్తున్నారు. తితిదే నిర్వహిస్తున్న యాగాల గురించి శ్రీ వేంక‌టేశ్వర ఉన్నత వేదాధ్యయ‌న సంస్థ ప్రాజెక్టు అధికారి విభీష‌ణ‌శ‌ర్మతో ఈటీవీ భారత్ ముఖాముఖీ నిర్వహించింది.

ABOUT THE AUTHOR

...view details