తిరుమల శ్రీవారి దర్శనం కోసం అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. కరోనా నిబంధనల మేరకు పరిమిత సంఖ్యలోనే భక్తులను... తితిదే అనుమతిస్తోంది. రోజుకు 30 నుంచి 35వేల మందికి దర్శన భాగ్యం కల్పిస్తోంది. దానికి సంబంధించి రోజుకు 20 వేల టికెట్ల చొప్పున ఈ నెలాఖరు వరకు ఆన్లైన్లో విక్రయించింది.
23వ తేదీన శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్లు
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఎక్కువ సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తున్నారు. అధిక శాతం భక్తులు సర్వదర్శనం కోసం వస్తుండడంతో...ఈ నెల 22 వరకు సంబంధించిన టోకెన్ల జారీ పూర్తయినట్లు తితిదే తెలిపింది. ప్రస్తుతం 23వ తేదీకి సంబంధించిన దర్శన టికెట్లను జారీ చేస్తున్నట్లు పేర్కొంది.
సర్వదర్శనం
ఎక్కువమంది భక్తులు సర్వదర్శనం కోసం వస్తుండడంతో... 22వ తేదీ వరకు సంబంధిత కోటా టోకెన్ల జారీ పూర్తయినట్లు తితిదే ప్రకటించింది. ప్రస్తుతం 23వ తేదీకి సంబంధించిన దర్శన టికెట్లను జారీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 24న ఆదివారం, 26న రిపబ్లిక్ డే కారణంగా రద్దీ మరింత పెరిగే అవకాశముందని భావించిన తితిదే... భక్తులు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేసింది.
ఇదీ చదవండి:తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు